విశ్వనగరంపై విషం చిమ్ముతున్నారు
ఎన్నికల అధికారులు కేసులు పెట్టాలి
సరూర్‌నగర్ జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి
సరూర్‌నగర్, మహానాడు : ఓట్ల కోసమే బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచా రంలో భాగంగా గురువారం సరూర్ నగర్ జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. ఈ లోక్‌సభ ఎన్నిక లు దేశ ప్రజలకు జీవన్మరణ సమస్య. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిరది. దేశంపై, సమాజంపై, రాజ్యాంగంపై, రిజర్వేషన్లపై దాడి చేయాలని మోదీ, అమిత్ షా బయలుదేరారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు, రిజర్వేషన్లను రక్షించేందుకు బాహుబలిలా రాహుల్‌గాంధీ ముందుకు వచ్చారు. తెలంగాణ గడ్డపై నుంచే యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో తెలంగాణ సమాజం రాహుల్‌గాంధీకి మద్దతుగా నిలవాలి. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అమిత్ షా మాట్లాడుతున్నారు. ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. రిజర్వేషన్లు రద్దు చేసి దేశాన్ని దోచుకో వాలన్న బీజేపీ ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. కాంగ్రెస్ కృషి వల్లే హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుం ది. ఈ విశ్వ నగరంపై బీజేపీ విషం చిమ్ముతోంది. మతం చిచ్చుపెట్టి ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని చూస్తోంది. తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. బీజేపీ ఉచ్చులో పడొద్దు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై ఎన్నికల అధికారులు కేసులు పెట్టాలి. బీజేపీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప మోదీ తెచ్చింది ఏమీ లేదన్నారు. ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.