మళ్లీ వస్తే భూములు తాకట్టు
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్
కావలి: వైసీపీ అధినేత జగన్‌కు ఇవే చివరి ఎన్నికలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.డి. విల్సన్ అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటిపై రూ.10 లక్షలు అప్పు ఉందని అవి ఎలా తీరు తాయని నిలదీశారు. పెన్షన్ల కోసం కార్యాలయాలు తనఖా పెట్టిన జగన్ మళ్లీ సీఎం అయితే తనఖా పెట్టడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడని అన్నారు. బీజేపీ కేంద్ర నిధుల స్మారకం గా నిర్మించిన పైలాన్‌ను రాత్రికి రాత్రి ధ్వంసం చేయించింది రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి అని, దీనిపై ఎన్నికల సంఘం విచారణ చేయాలని కోరారు. పోలీసు అధికారులను కూడా శిక్షించాలన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్‌కుమార్, రాష్ట్ర మరో కార్యవర్గ సభ్యురాలు కె.కమలకుమారి, బీజేపీ కన్వీనర్ సి.వి.సి.సత్యం, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచర్ల మురళీ, కావలి పట్టణ బీజేపీ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం, బీజేపీ రాష్ట్ర నాయకుడు బెల్లంకొండ మాల్యాద్రి, కావలి పట్టణ ప్రదాన కార్య దర్శి మందా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.