ల్యాండ్‌ టైట్లింగ్‌ జీవో కాపీల దహనం

కొత్తపేట: కొత్తపేట మండలం ఏనుగు మహల్‌లో ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం జీవో కాపీలను కూటమి నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు మాట్లాడుతూ ప్రజల భూములను దోచుకునేందుకు జగన్‌ తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని తెలిపారు. ఈ చట్టం వల్ల 2020 ఏప్రిల్‌ నుంచి 2023 మే వరకు రెవెన్యూ శాఖకు వచ్చిన భూ సంబంధిత ఫిర్యాదులు 1.34 లక్షలు అని తెలిపారు.