చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు సరికావు
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
మంగళగిరి: ఇంకా కొంతమంది ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకుంటున్నందు వల్ల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను మే 12 వరకు పొడిగించి వారికి ఓటు అవకాశం కల్పించాలని శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనాను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, టీడీపీ నాయకులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ అవగాహన లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికల సంఘానికి, హైకోర్టుకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వ్యవహారంలో చంద్రబాబుకు ఏమి సంబంధం ఉందని ప్రశ్నించారు. సభ్యతగా మాట్లాడాలని హితవుపలికారు. సమావేశంలో ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, తెదెపా బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, తెదెపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండూరి అఖిల్, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.