వైసీపీ శ్రేణుల వికృత చేష్టలు
మంగళగిరి, మహానాడు : మంగళగిరిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సభ సందర్భంగా వైసీపీ శ్రేణుల వికృత చేష్టలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఏకంగా జాతిపిత గాంధీ విగ్రహం తలకు జగన్ మాస్క్ పెట్టి అవమానించారు. మంగళగిరి పాత బస్టాండ్ చేనేత భవన్ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఇటీవల ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం ముఖానికి జగన్ మాస్క్‌ను తొడిగారు. శుక్రవారం సీఎం జగన్ పాత బస్టాండ్ సెంటర్‌లో బహిరంగ బహిరంగ సభ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు వికృత చేష్టలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేనేత భవన్ లో పోలీసులు ఉన్నా ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది.