ఆలోచించి ఓటు వేయాలి
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి, మహానాడు : తాకట్టు పెట్టేవి ఏమీ లేక మన ఆస్తులపై జగన్మోహన్ రెడ్డి కన్నేశాడు.. ప్రజలారా పారా హుషార్..ఆలోచించి ఓటు వేయాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కోరారు. నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. పరిపాలన చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఏకంగా రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు చేశాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం రెండున్నర లక్షల కోట్ల అప్పు ఉంటేనే గగ్గోలు పెట్టిన వైకాపా నాయకులు ఇప్పు డు జగన్ చేసిన రూ.13 లక్షల కోట్ల అప్పుపై స్పందించాలన్నారు. ఇక అప్పులు చేయడా నికి ఏమీ లేక ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి తెచ్చాడు. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి పేద పెత్తందారుకు ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పొరపాటు చేస్తే మీ భూమి, స్థలం మీది కాదు…ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.