గోడౌన్‌లలో ధాన్యం నిల్వకు మిల్లర్లకు అనుమతి

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌, మహానాడు: రైతుల దగ్గర సేకరించిన ధాన్యాన్ని త్వరగా తరలించేందుకు వీలుగా మార్కెట్‌ కమిటీ లలో ఉన్న గోడౌన్‌లలో ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు మిల్లర్లకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఇంకా ధాన్యం అమ్ముకోని వరి రైతులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.