-ఐటీసీతో మాట్లాడి ట్రేల పరిశ్రమలకు ప్రాధాన్యం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
అమరావతి, మహానాడు: రాష్ట్రంలో కోళ్ల పెంపకమే జీవనాధారంగా బతికే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. 2019కి ముందు ఉన్న ప్రభుత్వం ఈ కోళ్ల పెంపకంపై ఆధారపడి ఉన్న రైతులకు సబ్సిడీ ఇచ్చి ఆదుకునేదని, వైసీపీ ప్రభుత్వం ఆ సబ్సిడీని తీసివేసిందన్నారు. దీంతో కోళ్ల పెంపకంపై ఆధారపడిన రైతులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురయ్యారని వివరించారు. అలాగే కోడిగుడ్లు పెట్టుకునే ట్రేల పరిశ్రమలకు తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదు. ఐటీసీ వారు తెలంగాణా లో ఉన్న వాటికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వటంతో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు దెబ్బతి న్నాయని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఇటువంటి రైతులను ఆదుకునే విధంగా ఐటీసీతో మాట్లాడతాం. రైతులకు ఇచ్చే సబ్సిడీ సైతం పునరుద్ధరిం చేలా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజమండ్రి పార్లమెంట్‌లో ఉన్న కొన్ని నియోజకవర్గాలలో కోళ్ల పెంపకంపై ఆధారపడిన రైతులు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారు. రైతులను ఆదుకునే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.