హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యార్థులతో సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. హెచ్‌సీయూ ఎన్ఎస్యూఐ యూనిట్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మార్ వెంకట్, హెచ్‌సీయూ ఎన్ఎస్యూఐ ఇన్చార్జ్ అజయ్ ఆధ్వర్యంలో మ్యాచ్ జరిగింది. మధ్యలో షూ పాడైనా షూస్ లేకుండానే పాల్గొని ఉత్సాహపరిచారు. రేవంత్‌తో పాటు ఎమ్మెల్సీ బల్మార్ వెంకట్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, టీఎంఆర్ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, హెచ్‌సీయూ ఎన్ఎస్యూఐ యూనిట్, హెచ్‌సీయూ విద్యార్థులు మ్యాచ్‌లో పాల్గొన్నారు. రేవంత్‌తో పాటు సీఎం సలహా దారుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొ రేషన్ చైర్మన్ ఎం.ఎ.ఫహీం, టీ శాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు.