మాఫియా కాకాణి కావాలా? అభివృద్ధి చేసే సోమిరెడ్డి కావాలా?

`ఓడిపోయినా మంచి పనులు చేయడం తప్పా?
`ఒక నీచుడి చేతిలో ఓడినందుకు బాధగా ఉంది
`గొంతులో ప్రాణం తప్ప ఏమీ లేదు…
`ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి
`సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

సర్వేపల్లి, మహానాడు : నా గొంతులో ప్రాణం తప్ప ఏమీ లేదు. వరుస ఓటములతో అలసిపోయాను. సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో నిలిచేపోయే అభివృద్ధి పనులు చేశాను. రాజకీయ భిక్ష పెట్టిన పొదలకూరు మండలానికి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేసిన పని ఒక్కటి లేకపోగా ఐదేళ్లుగా వేల కోట్ల ప్రకృతి సంపదను కొల్లగొట్టేశాడు. సాగు, తాగునీటి ప్రాజెక్టులను బీడు పెట్టా డు. పేదల ఆకలి తీర్చే అన్నం క్యాంటీన్‌ మూసేశాడు. ఇద్దరి మధ్య తేడాను గమనించి రేపు ఓటు విషయంలో నిర్ణయం తీసుకోండి. ఈ ఒక్కసారి ఓటు వేసి సర్వేపల్లి ఎమ్మెల్యే గా ఆశీర్వదించాలని సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోరారు. పొదలకూరు బస్టాండ్‌ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

అత్యంత నీచుడి చేతిలో ఓడినందుకు బాధగా ఉంది…

తెలుగుదేశం పార్టీ కూటమి కార్యక్రమాలకు పోటెత్తుతున్న జనసమూహంతో తోడేరు రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రెండు నెలలుగా వేదాయపాళెం కార్యాలయంలో పండగలా జరిగిన చేరికలతోనే కాకాణి ఓటమి ఖాయమైంది. రాజకీయ జీవితంలో చేసిన ఒక్క మంచి పనిని కూడా ప్రచారంలో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. మొదటి నుంచి ఆయనకు తెలిసింది ఒక్కటే నోటికొచ్చినట్టు నన్ను బూతులు తిట్టడం, నా తల్లిదం డ్రులను కూడా దూషించడం, దోచుకోవడం..దాచుకోవడం. పొదలకూరు మండలంలో ఆయన చేసిన పని ఒక్కటి కూడా లేదు.. ఓటు అడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. అత్యంత నీచ చరిత్ర కలిగిన వ్యక్తి చేతిలో రెండుసార్లు ఓడిపోయినందుకు చాలా బాధప డుతున్నాను. ఆర్యవైశ్యులు ఒకరి జోలికిపోరు. అటువంటి ఆర్యవైశ్యుల్లో 19 మందిని జైలులో పెట్టిన కిరాతకుడు కాకాణి అని ధ్వజమెత్తారు.

దళిత యువకుడి ప్రాణాలు తీశారు…

వెంకటాచలం మండలంలో ఇద్దరు ముస్లిం యువకులు ఎస్సై కరీముల్లా చేతిలో ప్రాణా లు కోల్పోయారు. ఒక గిరిజనుడు మతిస్థిమితం కోల్పోయాడు. ఆ ఎస్సైపై చర్యలు తీసుకోవాల్సింది పోయి పొదలకూరుకు తీసుకొచ్చాడు. ఆ ఎస్సై చేతిలో దళిత సోదరుడు ఉదయగిరి నారాయణ లాకప్‌ డెత్‌కు గురయ్యాడు. ఎస్సైపై చర్యలు తీసుకోకుండా నారాయణది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సహకరించాడు. జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసి నారాయణ కుటుంబానికి అండగా నిలిచాం. చట్టప్రకారం దక్కాల్సిన ప్రయోజనాలను కల్పించాం. స్వాతంత్య్రం వచ్చాక సర్వేపల్లి చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా నేరాలు- ఘోరాలు ఈ ఐదేళ్లలో కాకాణి ఆధ్వర్యంలో జరిగాయి.

భూ కబ్జాల కాకాణి..

వరదాపురం మైన్‌లో వందల కోట్ల విలువైన క్వార్ట్జ్‌ కొల్లగొట్టేశాడు. అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసిన నా పైకి హిజ్రాలను ఉసిగొల్పాడు. పొదలకూరు మండ లాన్ని భూదందాలకు అడ్డాగా మార్చాడు. కోట్లాది రూపాయలతో కట్టించిన కరోనా ప్యాల ెస్‌ తనది కాదని కాకాణి చెప్పగలడా అని ప్రశ్నించారు. రామదాసుకండ్రిగలో పేదల భూములను అల్లుడికి దారాదత్తం చేశాడు. కాకాణి అక్రమ మద్యం దందా పుణ్యా న ఈ రోజు 16 మంది జైలులో ఉన్నారు. నా కారణంగా ఎన్నడూ ఎవరూ జైలుకెళ్లిన చరిత్ర లేదు. 2009లో ఆదాల ప్రభాకర్‌ రెడ్డి గెలిచినా కాకాణే పెత్తనం చేశాడు. కానీ చీకిరి పుల్లంత పనిచేశాడా? 2014, 2019లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలి పించి మంత్రిని చేశారు. అయినా పొదలకూరు మండలానికి ఒరిగింది శూన్యం.

ఓడినా అభివృద్ధి చేయడం తప్పా?

2014లో నేను ఓడినా చంద్రబాబు ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయి మంత్రిగా బాధ్యతలు చేపట్టా. రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ అందించేందుకు వాటర్‌ ప్లాంటు నిర్మించ డం నేను చేసిన తప్పా. పాడుబడిన ఆసుపత్రిని పగలగొట్టించి రూ.3.80 కోట్లతో కొత్త బిల్డింగ్‌ కట్టించడం నేరమా? కండలేరు ఎడమకాలువకు రూ.62 కోట్లతో లిఫ్ట్‌ ఏర్పాటు చేయించి రైతులు ఎప్పుడు కోరితే అప్పుడు సాగు నీరందించడం, నాన్‌ డెల్టాను డెల్టాగా మార్చడం తప్పా? సోమశిల దక్షిణ కాలువను తిరుపతినాయుడుపల్లి వద్ద సైఫన్‌ నుంచి వంక దాటించడం, రూ.7 కోట్లతో పెండిరగ్‌ పనులు చేపట్టడం తప్పా? ఐటీఐ భవనాలు, అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌లో భవనాల నిర్మాణానికి రూ.6 కోట్లకు పైగా నిధులు తెచ్చాను. నిమ్మ మార్కెట్‌లో 24 కొట్లు కట్టించాను. మార్కెట్‌ ఆవరణంతా సిమెంట్‌ రోడ్లు వేయించాను. ఏఐఐబీ నిధులు కోట్లాది రూపాయలు తెచ్చి నల్లబాళెం, పార్లపల్లి, దుగ్గుం ట లాంటి గ్రామాలకు రోడ్లు వేయించాను. పేదలకు రూ.5కే అన్నం పెట్టేందుకు పొదల కూరులో అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేయించాను. ఇన్ని చేసిన నాకు ఓటు వేసేందుకు పొదలకూరు మండల ప్రజలు ఎందుకు ఆలోచిస్తున్నారు. ఈ ఒక్కసారి సర్వేపల్లి ఎమ్మె ల్యేగా నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.