ప్రతిపక్ష హోదా పొందలేని స్థితిలో

వైసీపీకి దక్కనున్న స్థానాలు!

నా తెలుగుజాతికి ఈరోజు ప్రత్యేక శుభోదయం. ఆత్మగౌరవంతో రాజకీయ చైతన్యంతో రాష్ట్రం నలుమూలలా వైసీపీ రాక్షసులను, కాలకేయులను, సైకోలను, అహంకారులను తరిమి తరిమికొట్టిన నా తెలుగుజాతికి తెలుగు యువతకు, తెలుగు మహిళలకు, జనసైనికులకు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని రీతిలో ఓట్లతో పోటెత్తి అమోఘమైన ప్రజాస్వామిక తీర్పును ఇచ్చిన ఆంధ్రులకు నమస్సుమాంజలులు. తెలుగుదేశం కూటమికి 155 నుంచి 160 సీట్లు, వైసీపీకి 15 నుంచి 21 అసెంబ్లీ సీట్లు, రెండు లేదా మూడు పార్లమెంటు సీట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఆ పార్టీ అధినేతకు అత్యంత కావాల్సిన, దేశంలో ఒక అత్యంత శక్తివంతమైన కార్పొరేట్‌ సంస్థ పలు రకాలుగా చేయించిన నిష్పక్షపాత ఎగ్జిట్‌ పోల్‌ ద్వారా వచ్చిన బలమైన అంచనా.

తెలంగాణ గడ్డ మీద కూడా అసాంఘిక, అరాచక దోపిడీ రాజకీయ పార్టీ భారాసను రాష్ట్రవ్యాప్తంగా తుంగలో తొక్కినట్లు మూడోస్థానంలోకి నెట్టి రాజకీయంగా సమాధి చేసిన తెలంగాణా ప్రజలకు నమోవాకములు. తెలుగునేల మీద రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు అసాంఘిక, రాజకీయ అరాచక దోపిడీ శక్తులైన కల్వకుంట్ల, వైఎస్‌ కుటుంబాలకు రాజకీయంగా శాశ్వత సమాధి కట్టిన తెలుగుజాతికి శతకోటి వందనాలు. రాబోయే ఆరునెలల్లో బీఆర్‌ఎస్‌, వైసీపీ పార్టీలు రాజకీయంగా తెలుగు నేల మీద నుంచి శాశ్వతం గా కనుమరుగు కానున్నాయి.

`భవదీయుడు,
సువేరా