కలెక్టర్, ఎస్పీ ఉన్నా దాడులు ఆగలేదు
ముందుగానే రాళ్ల కుప్పలు, కర్రలు తెచ్చారు
అటువంటి చోట రీ పోలింగ్ నిర్వహించాలి
మాచర్లలో పిన్నెల్లి తమ్ముడి అరాచకాలు
నరసరావుపేటలో అభ్యర్థులపై దాడి హేయం
పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుట్ర పన్నారు
నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లాలో వైసీపీ శ్రేణుల దాడులు, అరాచకాలపై పల్నాడు జిల్లా టీడీపీ అభ్యర్థులు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోనే ఎక్కువగా హింసాత్మక ఘటనలు జరిగాయని, పోలీసులు, అధికారులు ప్రేక్షకపాత్ర పోషించారని ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయం లో మంగళవారం టీడీపీ నేతలు విలేఖరుల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్, ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా పరిధిలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు నరసరావుపేట చదలవాడ అరవిందబాబు, వినుకొండ జి.వి.ఆంజనేయులు, మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి, చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు, పెదకూరపాడు భాష్యం ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ నిన్న ఓటింగ్ చూసిన తర్వాత పార్లమెంట్‌లో మా విజయం ఖాయ మైందన్నారు. దాడులు జరిగిన పోలింగ్ కేంద్రాల వద్ద వెంటనే రీ పోలింగ్ జరిపించాలని కోరారు. నిన్న జిల్లాలో వైసీపీ శ్రేణులు అనేక దాడులకు తెగబడ్డారని తెలిపారు.
కలెక్టర్, ఎస్పీ ఉన్నా దాడులు ఆగలేదు
మాచర్ల అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోనే ఎస్పీ, కలెక్టర్ ఇద్దరూ ఉన్నా ఎక్కడా దాడులు ఆగలేదు. వైసీపీ నేతలకు పోలీసులు కొమ్ముకాశారు. రెంటాల గ్రామంలో మా ఏజెంట్లను పోలింగ్ బూత్ నుంచి ఉదయం 7 గంటలకే బయ టకు నెట్టేశారు. జరిగిన ఘటనపై మేము ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేయలేదు. జరుగుతున్నదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వైసీపీ నేతలు మాపై కళ్లలో కారం కొట్టి మరీ దాడి చేశారు. స్వయంగా మా కార్యకర్తలపై ఎమ్మెల్యే పిన్నెల్లి తమ్ముడు వెంకట రామిరెడ్డి దాడి చేసి కార్యకర్తలను కారుతో ఢీకొట్టాడు. పల్నాడులో వైసీపీ నేతల వాహ నాలలో రాడ్లు, కర్రలు, ఇతర మారణాయుధాలు పెట్టుకుని తిరుగుతున్నారు.
వైసీపీకి తొత్తులుగా పోలీసు వ్యవస్థ
నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ పల్నాడులో ప్రజా స్వామ్యం లేదని నిన్నటితోనే తెలిసింది. పోలీసులు మా పోలింగ్ శాతం తగ్గించడానికి ప్రయత్నించారు. పోలీస్ వ్యవస్థ వైసీపీ నేతలకు తొత్తులుగా మారింది. దొండపాడులో పోలీసులు, సబ్ కలెక్టర్ ముందే నాపై దాడి జరిగింది. నియోజకవర్గంలో పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నేతలకు అనుకూలంగా పని చేశారు. నరసరావుపేటలో వైసీపీ శ్రేణులు నడిరోడ్డులో చదలవాడ అరవిందబాబుపై దాడి చేసి కార్లను ధ్వంసం చేశారు. పోలీసులు, అధికారులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయబోతున్నాం. పల్నాడు జిల్లాలో 80 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోవటం సంతోషకరం.
పోలింగ్ శాతం తగ్గించడానికి కుట్ర
చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పోలింగ్ పర్సంటేజ్ తగ్గించడంలో ఒక కుట్ర కోణం దాగి ఉందని మా అనుమానం. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈవీఎం మిషన్‌లు చాలా స్లోగా పనిచేశాయి. చిలకలూరిపేట నియో జకవర్గ పరిధిలో అనేక గ్రామాల్లో వైసీపీ నేతలు మొత్తం ప్రతి గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద రాళ్ల కుప్పలు, కర్రలు ఎందుకు పెట్టుకున్నారు. ఓటమి భయంతోనే పలు గ్రామాల్లో మా కార్యకర్తలపై దాడులు చేశారు. పల్నాడులో పోలింగ్ జరగకుండా ఈవీఎం మిషన్లు బద్దలు కొట్టడానికి వైసీపీ వర్గీయులు పూనుకున్నారు.
జగన్‌రెడ్డి ప్రోద్బలంతోనే రాళ్లు తోలించారు
సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సీఎం జగన్‌రెడ్డి ప్రోద్బలంతోనే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నేతలు రాళ్లు తోలించారు. సత్తెనపల్లిలో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించడానికి అనేక కుట్రలకు తెరలేపారు. ఓటర్లను భయబ్రాం తులకు గురిచేయాలని కుట్రలకు తెరదించారు. వైసీపీ నేతలు చేసే అరాచకాలకు ఎదురు నిలబడి మా కార్యకర్తలు పోలింగ్ చేశారు. ఈ ఆరాచక ప్రభుత్వం ఇక పోయింది. జగన్ ఇంటికి వెళతాడా..జైలుకు వెళతాడా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
ఓటమి భయంతో హింస
వినుకొండ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ కూటమి భారీ విజయం సాధిస్తుం దని ముందు నుంచీ చెబుతున్నాం. 150కి పైగా సీట్లతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. గణనీయంగా పెరిగిన ఓటింగ్ కూడా కూటమి విజయానికి సంకే తం. పల్నాడులో ఓటమి భయంలోనే అధికార పార్టీకి హింసకు పాల్పడిరది. వినుకొండ హింసకు నూటికి వెయ్యి శాతం వైకాపా కుట్రలే కారణం. నూజెండ్ల, శావల్యాపురం హింసపై తక్షణం కఠినచర్యలు తీసుకోవాలి. హింసను అరికట్టలేని పోలీసులను తక్షణం ఇంటికి పంపించేయాలి. రాబోతున్నది ప్రజాప్రభుత్వం అని గుర్తుపెట్టుకుని మసులు కుంటే మంచిది.