రాష్ట్రానికి మోదీ గ్యారంటీతో ప్రజల్లో చైతన్యం

` పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టులే ధ్యేయం
– బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర

గుంటూరు, మహానాడు : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ గ్యారంటీ అని ప్రజలు విశ్వసించినందు వల్లే ఓటింగ్‌కు పెద్దఎత్తున తరలివచ్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్‌ అన్నారు. గుంటూరులో మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు అవుతారని అన్నారు. గుంటూరు పార్లమెంట్‌కు పోటీ చేసిన పెమ్మసాని ప్రజలకు ఎంతో దగ్గరయ్యా రని, ఆయన ఆలోచనలతో గుంటూరును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తారని తెలిపారు. పార్లమెంటు పరిధిలో అసెంబ్లీలకు పోటీ చేసిన నజీర్‌ అహ్మద్‌, గల్లా మాధవి, నారా లోకేష్‌, నాదెండ్ల మనోహర్‌, ధూళిపాళ్ల నరేంద్ర, రామాంజనేయులు విస్తృతంగా పర్యటిం చారన్నారు. బీజేపీ కార్యకర్తలు విజయ సంకల్ప దీక్షతో పని చేశారని అన్నారు.

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ కూటమిని విజయం దిశగా నడిపించినందుకు రాష్ట్ర ప్రజలు ధన్యవాదాలు చెప్పాలని అన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి పరిశ్రమలు తీసుకురావడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం తమ ప్రధాన ధ్యేయమన్నారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసమే కేటాయిస్తారని ఆకాంక్షించా రు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చరకకుమార్‌ గౌడ్‌, ఉపాధ్యక్షుడు తులసి యోగేష్‌, పెరుమాళ్ల అనంత పద్మనాభం, మంత్రి సుగుణ, పొన్నూరు అసెంబ్లీ కన్వీనర్‌ వరికూటి వీర సుధాకర్‌, మండల అధ్యక్షుడు పెమ్మరాజు సుధాకర్‌, సురేష్‌ జైన్‌, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణచైతన్య, జిల్లా కార్యవర్గ సభ్యులు రమాదేవి పాల్గొన్నారు.