-ఎప్పటికప్పుడు పిన్నెల్లి అనుచరులకు సమాచారం
-కాల్ డేటాను విశ్లేషిస్తున్న ఉన్నతాధికారులు
మాచర్ల, మహానాడు: మాచర్లలో పోలీసుల కదలికలు, డిపార్ట్‌మెంటల్ యాక్షన్‌ను ఎప్పటికప్పుడు పిన్నెల్లి మనుషులకు చేరవేసిన పలువురు కిందిస్థాయి సిబ్బందిని కాల్‌డేటా ఆధారంగా గుర్తించా రు. అల్లర్ల నేపథ్యంలో మాచర్లలో ప్రత్యేకంగా పోలీసులు బలగాలను మోహరించి తనిఖీ లు చేసే విషయాన్ని ముందుగా వైసీపీ నేతలకు చేరవేసిన ఏడుగురిని కాల్ డేటా ఆధా రంగా పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. పోలీసుస్టేషన్‌లో ఉండే సహాయకులు, కిందిస్థాయి సిబ్బంది ద్వారా వైసీపీ నేతలు సమాచారం తెప్పించుకున్నారని తెలుసుకున్నారు. తనిఖీల సమయంలో వైసీపీ గూండాలు తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు వారు సమాచారం అందించి ఉంటారని భావిస్తున్నారు. వాట్సాప్ డేటా, చాటింగ్, ఫోన్ కాల్ డేటా ఎవరి నుంచి ఎవరికి వెళ్లిందనే దానిపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. లోతైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు.