చింతమనేని కార్యాలయంలో సందడి

దెందులూరు, మహానాడు: ఐదేళ్లు అవినీతి, అక్రమాలు, ప్రశ్నిస్తే దాడులే లక్ష్యంగా సాగిన వైసీపీ పాలనలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న వారు కూటమి గెలుస్తుందన్న వార్తలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుగ్గిరాలలోని చింతమనేని కార్యాలయంలో బుధవారం ఉదయం పలు గ్రామాల నుంచి పెద్దఎత్తున ప్రజలు చింతమనేనిని మర్యాదపూర్వకంగా కలిశారు. పోలింగ్‌లో దెందులూ రు నియోజకవర్గంలోని పెదవేగి, పెదపాడు, దెందులూరు సహా ఏలూరు రూరల్‌ మండ లాల్లోని అన్ని గ్రామాల్లో ఓటర్లు తరలివచ్చి అండగా నిలిచారని వివరించారు. చింతమ నేని ప్రభాకర్‌ వారిని ఆప్యాయంగా పలకరించి కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద కొడుకులా అండగా ఉంటానని తెలిపారు.