1920 ల్లో ఫ్యాన్స్ ఇలా ఉండేవట !
ఎండవేడిమి నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడంటే ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపు సీలింగ్ ఫ్యాన్స్, కూలర్స్, ఏసీ లు వచ్చాయి.
ఓ పాతిక, యాభై ఏళ్ళ క్రితం విసనకర్రలతో ఉక్కపోత నుంచి బయటపడేవాళ్ళం.
అయితే 1920 ల్లో ధనికుల ఇంట్లో వినియోగించిన ఫ్యాన్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనికి టేబుల్ ఫ్యాన్ మాదిరిగా ఇరువైపులా పంకాలు ఉండగా 360 డిగ్రీలు తిరుగుతోంది.
ఇలాంటి ఫ్యాన్ ను ఎప్పుడైనా చూశారా?
– సింగం శివాజీ