రాష్ట్రంలో అలర్లకు వైసీపీ నేతలే కారణం

అధికారుల వ్యవహార శైలి అనుమానంగా ఉంది
ఎన్నికల సంఘానికి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తాం
బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం

విజయవాడ, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన పోలింగ్‌ శాతం చూస్తే ప్రజల స్పందన అర్థమవుతోందని, ఎన్నికల సంఘం తీసుకున్న అనేక చర్యలతో ప్రజలు ఓట్లు వేసేందుకు తరలివచ్చారన్నారు. ఐప్యాక్‌ టీం సమావేశంలో 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ వస్తాయని జగన్‌ చెప్పుకుంటున్నారని,
దీనినే దింపుడు కళ్లెం ఆశ అంటారనేది వాళ్లు తెలుసుకోవాలని వ్యాఖ్యానిం చారు. ప్రజలు బ్యాలెట్‌ బాక్సులలో తమ నిర్ణయం సిద్ధం చేశారు.. వైసీపీ ఓట మి ఖాయమన్నారు. ఇసుక తవ్వకాలు ఏపీలో యథేచ్ఛగా జరుగుతున్నా యని, దీనిపై కలెక్టర్లు అసత్యాలతో నివేదికలు ఇచ్చారని తెలిపారు. ఇసుక మాఫియా ను కంట్రోల్‌ చేయాల్సిన అధికారులే అక్రమార్కులకు వంత పాడుతున్నారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి కూడా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. పెన్షన్ల విషయంలోనే సీఎస్‌ వ్యవహార శైలి అనేక అనుమానాలకు తావిచ్చిందని వ్యాఖ్యానించారు. వివిధ ఆరోపణల్లో ఉన్న అధికారులను తప్పించాలని మేము కోరితే..వారిని ప్రాధాన్యత పోస్టుల్లో వేశారని తెలిపారు.

అల్లర్లకు వైసీపీ నేతలే కారణం

ఆళ్లగడ్డ, తిరుపతి, ఇతర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు కూడా వైసీపీ ఓటమిని తెలియ చేస్తున్నాయి. పోలీసులు ముందు చూపుతో వ్యవహరించక పోవడం వల్లే ఈ దాడులు జరిగినట్లు అర్థం అవుతుంది. స్టాంగ్‌ రూమ్‌కు సమీపంలో పార్టీలు పెడితే.. ఎలా అనుమతి ఇచ్చారో చెప్పాలి. పోలింగ్‌ అనంతరం పోలీసులు, టీడీపీ నేతలపై దాడి చేసి తలలు పగులకొట్టింది వైసీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారుల జాబితాను ఎన్నికల సంఘానికి అందజేస్తామని తెలిపారు. వైసీపీ నేతలకు ఓటమి తేలిపో యింది.. అందుకే ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో అధికారులు, పోలీసులు తమ మాట వినడం లేదని పేర్ని నాని, అంబటి రాంబాబు ఇప్పుడు అంటున్నారని, మరి ఇదే నాని గతంలో ఎస్పీ ఎవడు నాక న్నా తక్కువ అంటూ రంకెలు వేయ లేదా అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు, అనిల్‌కుమార్‌, అప్పిరెడ్డి వంటి వారు నోరు పారేసుకోలేదా అని ప్రశ్నించారు. కేంద్రంలో 400 సీట్లు, ఏపీలో ఎన్డీఏ కూటమి 160 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతిపై విచారణ ఉంటుందని వెల్లడిరచారు.