ఐదు నెలల కాంగ్రెస్‌ పాలన నిరాశాజనకం

హామీలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి
బోనస్‌పై మంత్రులు పూటకో మాట చెబుతున్నారు
బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌రెడ్డి

హైదరాబాద్‌, మహానాడు : బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌రెడ్డి బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా పనితీరు మాత్రం పూర్తి నిరాశాజనకంగా ఉంది. కాంగ్రెస్‌ అభయ హస్తం అక్కరకు రాని నేస్తంగా మారింది. సీఎం రేవంత్‌ మంత్రులకు దేని మీద స్పష్టత లేదు. తలో రకంగా మాటలు ఉంటున్నాయి. వడ్లకు బోనస్‌పై కాంగ్రెస్‌ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారు. దశల వారీగా అన్ని రకాల వడ్లకు బోనస్‌ అంటున్నా రు. దశల వారీగా అంటే ఏమిటో అర్థం కాలేదు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్‌ ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నాం.

రైతు భరోసా రూ.7,500 ఇవ్వాల్సిందే..

ఈ ఖరీఫ్‌లో రైతు భరోసా ఎకరాకు 7500 రూపాయలు ఇవ్వాలి. ప్రతి హామీపై రేవంత్‌ ప్రభుత్వానిది డొంక తిరుగుడు వైఖరిలా కనిపిస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయ మంత్రి ఉన్నారా? అని ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌ కింద తులం బంగారం ఎప్పుడిస్తారు? విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తారో చెప్పాలి. మహాలక్ష్మి కింద ప్రతి నెలా మహిళకు 2500 ఎప్పుడిస్తా రో చెప్పాలి. రైతు రుణాల మాఫీని ఆగస్టు 15 లోగా చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు వేశారు. దాని అమలు కూడా అనుమానాస్పదంగా ఉంది. రుణమాఫీ కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని లీకులు ఇస్తున్నారు.కానీ, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణాలు మాఫీ చేయడం అసాధ్యం. మండలానికో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అంటున్నారు..సీఎం రేవంత్‌ స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ..ఈ విషయంలో కార్యాచరణ ఏమి టో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని హామీల అమలు పై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.