అగ్నిప్రమాద బాధితులకు రూ.లక్ష సాయం
జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ప్రశంసలు
అవనిగడ్డ: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల నామినేషన్లో కాల్చిన బాణసంచా వల్ల యాసం వెంకటేశ్వరరావు గృహం పూర్తిగా కాలిపోయి ఆ కుటుంబం నిలువ నీడలేకుండా పోయింది. దీంతో ఎన్ఆర్ఐ జనసైనికులు స్పందించి లక్ష రూపాయల చెక్కును పంపగా గురువారం అవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ జనసేన ప్రతినిధులు పద్యాల శివరామ ప్రసాద్, మోహనకృష్ణ, సాధు మాధవ, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, ఎన్నికల నిర్వహణ పార్లమెంటరీ కమిటీ సభ్యులు చిలకలపూడి పాపారావు, అవనిగడ్డ మండల అధ్యక్షుడు గుడివాక శేషుబాబు, అవనిగడ్డ టౌన్ అధ్యక్షుడు రాజనాల వీరబాబు, మోపిదేవి మండల అధ్యక్షుడు పూషడపు రత్నగోపాల్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బాదార్ల లోలాక్షుడు, ఘంటసాల రాజమోహనరావు, శోభిల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.