సీఎంవో అధికారి డైరెక్షన్‌లో పిన్నెల్లి భద్రం

కావాలనే తప్పించి ఈసీ ముందు దొంగనాటకాలా?
పోలీసులు ఎవరి ఆధీనంలో ఉన్నారో ఈసీ చెప్పాలి
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు

వినుకొండ, మహానాడు : రాష్ట్ర పోలీసులు ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నారో ఈసీ చెప్పాలని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ప్రశ్నించారు. ఈవీఎం పగులకొట్టిన రౌడీని పట్టుకోలేకపోవడం సిగ్గుచేటు కాదా అని ధ్వజమెత్తారు. హౌస్‌ అరెస్టు నుంచి తప్పించుకున్న వెంటనే పిన్నెల్లిని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. అరెస్టు యత్నానికి ముందు రోజే పిన్నెల్లి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆయనను కావాలని తప్పించి ఈసీ ముందు దొంగనాటకాలు ఎందుకు? సీఎంవో డైరెక్షన్‌ మేరకే పిన్నెల్లి పరారీ డ్రామాను పోలీసులు రక్తి కట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎంవో కీలక అధికారి సూచన మేరకే పిన్నెల్లిని దాచిపెట్టారని ఆరోపించారు.