డీజీపీకి దేవినేని ఉమ లేఖ

పల్నాడులో హింసపై ఆధారాలు
వైసీపీ మూకలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

మంగళగిరి, మహానాడు : డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు లేఖ రాసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహే శ్వరరావు గురువారం లేఖ రాశారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని అనుచరులు సాగించిన హింసాకాండకు సంబంధించిన ఆధారాలతో సహా ఇస్తున్నాం. మాచర్ల మండలం రాయవరం గ్రామంలోని 51వ పోలింగ్‌ బూత్‌లో వైసీపీ గూండాలు టీడీపీ ఏజెంట్లను బయటకు లాగి దాడి చేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ రిగ్గింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. బాధితులను రక్షించడంలో విఫలమైన పోలీసులపై చర్య లు తీసుకోవాలని కోరారు. వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిపురం గ్రామంలో టీడీపీ ఏజెంట్‌ రేఖానాయక్‌ను బూత్‌ నుంచి బయటకు బలవంతంగా లాక్కొచ్చి కొట్టి తీవ్రంగా గాయపర్చారు. అనంతరం వైసీపీ కార్యకర్తలు బూత్‌ వద్ద రాళ్ల దాడికి పాల్పడ్డారు. నరసరావుపేట నియోజకవర్గంలో డీజే శివపై రాడ్లు, కర్రల తో దాడి చేసి చావబాదారు. మాచర్లలో దాడులకు పిన్నెల్లి ముందుగానే రచించు కున్న వ్యూహానికి కొందరు పోలీసులు దన్నుగా నిలిచారు. టీడీపీ కార్యకర్తలు, ఓటర్లపై దాడులకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.