-గెలుపోటములపై ఒక్కసారిగా మారిన లెక్కలు
-కూటమి ఖాయమన్న సంకేతంతో భూములకు రెక్కలు
-ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్ వ్యాపారం
-ఎకరం కోటికి పైనే…అయినా అమ్మేవారు లేరు
-రాజధాని ప్రాంతం చుట్టూ రియల్ వ్యాపారుల చక్కర్లు
-ఐదేళ్ల అరాచక పాలన పోతుందన్న ఆనందంలో రైతులు
వాసిరెడ్డి రవిచంద్ర
ఏపీ రాజధాని అమరావతి సీఆర్‌డీఏ పరిధిలోని భూములకు అమాంతంగా రెక్కలు వచ్చాయి. రెండురోజులుగా భూముల ధరలు ఆకాశాన్నంటాయి. కేంద్రం లో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారం ఖాయమన్న సంకేతాల నేపథ్యంలో అమరావతి ప్రాంత భూముల ధరలు పెరిగిపోయాయి. జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్లు మూడు రాజధానులు ఆటతో అమరావతి రాజధా ని ఉంటుందో ఉండదోనన్న అనుమానాల నేపథ్యంలో అభివృద్ధి కుంటుపడిరది. రియల్ ఎస్టేట్ పడిపోయింది. 2014 తర్వాత స్వచ్ఛందంగా తుళ్లూరు ప్రాంతంలో రైతుల వద్ద గత చంద్రబాబు ప్రభుత్వం 36 వేల ఎకరాల భూమిని సేకరించి అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంగా నిర్ణయించి కొంతమేరకు అభివృద్ధిని ప్రారంభించారు. తాత్కాలిక భవనాల పేరుతో సచివాలయ భవనాలు, ఐఏఎస్ అధికారుల భవనాలు, అభివృద్ధికి సంబంధించిన రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు ప్రారంభించి అభివృద్ధికి పునాదులు వేశారు.
మూడు రాజధానులతో పడిపోయిన ధరలు
2019లో జగన్ అధికారం చేపట్టిన వెంటనే అమరావతిని అటకెక్కించారు. కేవ లం శాసన రాజధాని అమరావతి, విశాఖ పరిపాలన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా బిల్లు ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని ఉంటుందా లేదా అన్న అనుమానాలకు ఆస్కారమిస్తూ గత ఐదేళ్లు జగన్ పాలన సాగింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఐదేళ్ల పాటు అలుపె రగకుండా న్యాయస్థానాలలో అదేవిధంగా బయట పోరాటాన్ని సాగించారు. దీంతో అక్కడ భూముల ధరలు సగానికి సగం పడిపోయాయి.
రెండు రోజుల్లో మారిన లెక్కలు
అయితే ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి మా భూములకు పాత ధరలు వచ్చా యి. ఎన్నికలు ముగిశాక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందా? తిరిగి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా? అన్న అనుమానాలతో ఎవరి లెక్కలు వారు వేశారు. జగన్ ప్రభుత్వం ఏర్పడుతుందని జూన్ 9న ముహూర్తంగా నిర్ణయించి విశాఖ రాజధానిగా అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారని జగన్ అండ్ కో ప్రచారాన్ని చేశారు. జగన్ లండన్ వెళుతూ ఐప్యాక్ టీంతో తిరిగి మనం అధికారాన్ని చేపడుతున్నాం.. 151 సీట్లు వస్తున్నాయని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇలా ఎవరి లెక్కలు వారు వేస్తూ భారీగా బెట్టింగులు కూడా వేశారు. అయితే గత రెండు రోజులుగా అంచనాలు తలకిందులు అవడం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారం ఖాయమన్న వార్తల నేపథ్యంలో అమరావతిలో ధరలకు రెక్కలు వచ్చా యి. మోదీ, అమిత్‌షా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రకటన చేయడంతో మరింత స్పష్టత పెరిగింది. దాంతో టీడీపీ శ్రేణులు గెలుపుపై భారీ అంచనాలతో బెట్టింగులకు సై అనడం…వైసీపీ శ్రేణులు వెనకడుగు వేయడం తో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టమైన సంకేతాలు వెలుపడ్డాయి.
ఎకరం కోటి పైనే…అయినా అమ్మేవారు లేరు
జగన్ న్యాయవాది పొన్నులేటి సుధాకర్‌రెడ్డి కన్నీరు కారుస్తూ జగన్ను కాపాడు కోవాలని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులను డీలా పడేలా చేశాయి. దాంతో తెలుగుదేశంలో రెట్టింపు ఉత్సాహం మొదలైంది. దీంతో కూటమి అధికారం ఖాయ మని.. స్పష్టంగా 115 సీట్ల వరకు వస్తాయని అంచనాల నేపథ్యంలో అమరావతి లో భూములకు రెక్కలు వచ్చాయి. నిన్నటి వరకు గజం రేటు రూ.25 వేలు ఉంది కాస్తా రూ.35 వేల వరకు పలుకుతోంది. రూ.35 వేలు ఉన్నది రూ.45 వేల వరకు పలుకుతోంది. ఈ రెండు రోజులలో పదివేలకు పైగా గజం రేటు పెరగ డంతో అమరావతిలో తిరిగి రాజధాని ప్రారంభమవుతుంది.. చంద్రబాబు ముఖ్య మంత్రి అవుతారు అన్న అంచనాలు పెరిగిపోయాయి. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో పొలాల రేట్లు కూడా ఎకరం 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ధరలు పెరిగాయి. అమ్మేవారు లేకపోవడం…కొనడానికి ఎక్కువమంది ఆసక్తి చూపడంతో ధరలకు రెక్కలు వస్తున్నాయి. అంచనాలకు మించి అమరావ తిలో ధరలు పెరిగిపోయాయి.
రియల్ వ్యాపారుల చక్కర్లు
అమరావతి అభివృద్ధి ప్రారంభమవుతుందన్న నమ్మకంతో ఎన్నారైలు, అదేవిధంగా హైదరాబాదు, వైజాగ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమరావతిపై మమకారం ఉండి అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో అనేకమంది పెట్టుబడు లు పెట్టేందుకు ఉరకలు వేస్తున్నారు. దీంతో అమరావతిలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. జూన్ నాలుగు తర్వాత వీరి అంచనాలు నిజమై చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తే గజానికి మరో రూ.10 వేలు ధర కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాజధానిలో భూముల కోసం వందలాదిమంది పరుగులు తీస్తూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అమ్మేవారు తక్కువ ఉండ డం.. కొనేవారు ఎక్కువ ఉండడంతో భూముల ధరలు నానాటికీ పెరిగిపోతు న్నాయి. రాజధాని రైతుల్లో మునుపటి ఆశలు చిగురించాయి. జగన్ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టినా కోర్టుల చుట్టూ తిరిగి ఉద్యమాలు చేశాం.. మా త్యాగం ఊరికే పోదు… అని ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నిజం అవడం తో రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. మోదీ తిరిగి ప్రధాని కావడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవడంతో మా అమరావతి రాజధాని ప్రాంతం అవిరామంగా అభివృద్ధి చెందుతుందన్న ఆశతో ఉన్నారు. మరి అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ ధరలు ఎంతవరకు వెళతాయో చూడాల్సి ఉంది.