అమరావతిపై వడ్డే శోభనాద్రీశ్వరరావు మొసలికన్నీరు

మోదీపై చిల్లర ప్రచారాన్ని ప్రజలు నమ్మరు
బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌

విజయవాడ: అమరావతిపై వడ్డే శోభనాద్రీశ్వరరావు మొసలికన్నీరు కారుస్తున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఒక ప్రకటనలో మండిపడ్డారు. 2019 ఎన్నికల ముందు అమరావతి నిర్మాణానికి వ్యతిరేకంగా వైకాపాను గెలి పించడానికి కల్లం అజయ్‌రెడ్డితో కలిసి ప్రధాన పాత్ర పోషించారని, నేడు అదే రైతులు వద్దకు వచ్చి అమరావతికి మద్దతు అంటూ కేవలం ప్రచారం కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. ఫలితాలు రాబోతున్న తరుణంలో మరో సారి ఆయన తన వికృత మనస్తత్వాన్ని ఆవిష్కరించడానికి మోదీకి కుసంస్కారంతో అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేయడం అంటే మరోసారి ప్రజల్ని మోసం చేయటానికే వడ్డేతో పాటు అతని మిత్ర బృందం తయారైందని చెప్పకనే చెబుతు న్నారని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డిని గెలిపించడానికి ఏ విధంగా లాలూచీపడి అమరావతికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారో ఇప్పు డు అవాస్తవాల ప్రచారం కోసం పుస్తకాన్ని మోదీకి వ్యతిరేకంగా విడుదల చేసే దుష్టపన్నాగాన్ని వడ్డే శోభనాద్రీశ్వరరావు అతని మిత్రబృందం ఒడిగట్టిందని తెలిపా రు. అయితే ఇటువంటి చిల్లర ప్రచారాలను ప్రజలు నమ్మరని అన్నారు.

మోదీ సేవలు గుర్తు రాలేదా…

ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో వచ్చే చందాలు అన్నీ రాజకీయ పక్షాలు ఆహ్వానించి స్వీకరించాయి. గతంలో పార్టీలకు నల్ల ధనంలో వచ్చే చందాలకు చెక్‌ పెట్టడానికి ఎలక్టోరల్‌ బాండ్‌ విధానం తేవడానికి కారణమైంది. కరోనా కష్టకాలంలో ఉచితం గా ప్రజలకు వ్యాక్సిన్‌ ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదని, ఈ ఈ పుస్తక విడుదల కార్యక్రమంలో హాజరవుతున్న ప్రతిఒక్కరూ దానిని ఉచితంగా వేసుకున్నారని మరచిపోవద్దని గుర్తు చేశారు. 80 కోట్ల మంది ప్రజలకు కరోనా అనంతరం వచ్చే ఐదేళ్లకు ఉచితంగా ఐదు కిలోల బియ్యం గరీబ్‌ కళ్యాణ అన్న యోజన కింద ఇస్తున్నారని తెలిపారు. దేశంలో పేదలకు ఐదు కోట్ల ఉచిత గృహా లను పీఎంఏవై పథకం కింద అందిస్తున్నారు. 50 కోట్ల కుటుంబాలకు ఆయు ష్మాన్‌ భారత్‌ కింద ఉచిత వైద్యం అందిస్తున్నారు. గడచిన 10 సంవత్సరాలలో 34 లక్షల కోట్లను డీబీటీ కింద లీకేజ్‌ లేకుండా వివిధ పథకాల నిధులను నేరుగా ప్రజల ఖాతాలకు నగదు జమ చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతున్నా మన దేశం 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి అత్యధికంగా 8.2 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రధానిగా నరేంద్ర మోదీ చేసిన సేవ తెలియజేయాల్సిన బాధ్య త ఈ పుస్తక రచయితలకు ఉంటుందని తెలిపారు.