నరసరావుపేట: సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 28,500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ పత్రం అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబు ఆశీస్సులతో తనను గెలిపించిన సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు, కూటమి కార్యకర్తలకు కృతజ్ఞత లు తెలిపారు. ఎల్లప్పుడూ మీకు తోడుగా అండగా నిలుస్తానని మాట ఇచ్చారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణ దేవరాయలు గెలుపొందారు. ఆయనకు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాత్కర్ డిక్లరేషన్ పత్రం అందజేశారు.