నాయకుడొచ్చారు!

– చంద్రబాబుకు ఢిల్లీలో రెడ్‌కార్పెట్ – మోదీ పక్కనే బాబుకు సీటు – బాబును కలిసేందుకు పోటీ పడ్డ బీజేపీ ప్రముఖులు – మేళతాళాలతో ఘన స్వాగతం – స్పీకర్ సహా మంత్రిపదవులిచ్చే అవకాశం – మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పనున్న చంద్రబాబునాయుడు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. అన్నీ తెలిసిన వాడు అణకువగానే ఉండి అనుకున్న కార్యం సాధిస్తాడు. ఇది […]

Read More

బీజేపీ గెలుపు కోసం బీఆర్‌ఎస్‌ ఆత్మ బలిదానం

సొంత ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారు కేసీఆర్‌ రాజకీయ జూదగాడు..పార్టీ బతికేది లేదు హరీష్‌..ఆత్మాహుతి దళాలుగా మారితే కనుమరుగైపోతావ్‌ మోదీ గ్యారంటీకి వారంటీ చెల్లింది..రాజీనామా చేయాలి ఏపీకి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది ప్రజాపాలనకు రెఫరెండం ఈ ఎన్నికలు…ఓట్ల శాతం పెరిగింది మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌: గాంధీభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయి. రాహుల్‌గాంధీ […]

Read More

ఆ అధికారి వైఖరి పార్టీని దెబ్బతీసింది…

ఎంతో అభివృద్ధి చేశా..ప్రజలతోనే ఉన్నా ఓటమికి కారణం అంతుచిక్కడం లేదు… ప్రజలతో మమేకమవడం మేము చేసిన తప్పా? కూటమి హామీలకు ప్రజలు మోసపోయారా? కాపుల కష్టాలను పట్టించుకోని వారు హీరోలయ్యారు కన్నతల్లికి ఒంట్లో బాగోకపోయినా ప్రజల కోసం పనిచేశా ఏదిఏమైనా వైఎస్‌ కుటుంబంతోనే కలిసి ఉంటాం రాజానగరం వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా వ్యాఖ్యలు. రాజానగరం:  ఎన్నికల్లో వైసీపీ పరాజయం, తన ఓటమిపై రాజానగరం వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా […]

Read More

కీలక ఫైళ్లను జాగ్రత్త పరచాలి

ప్రాసెస్‌ చేయొద్దన్న స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రెవెన్యూ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు అమరావతి: కాంట్రాక్టర్లకు నిధుల విడుదలతో పాటు భూకేటాయింపుల ఫైళ్లను నిలిపి వేయాలని, కీలక ఫైళ్లను జాగ్రత్త పరచాలని స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి పేషీలోని రికార్డులు ఫైళ్లను జాగ్రత్త పరచాలని అధికారులను ఆదేశించారు. బదిలీ ఫైళ్లను కూడా నిలిపివేయాలని స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ సూచించారు.

Read More

ముఖ్యమంత్రి రేవంత్‌కు టీపీసీసీ కార్యవర్గం అభినందనలు

హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ సాధించిన ఫలితా లపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని బుధవారం టీపీసీసీ కార్యవర్గం అభినందించింది. గతంలో మూడు పార్లమెంట్‌ స్థానాలకే పరిమిత మైన కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సారథó్యంలో 8 స్థానాలకు చేరు కోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌ కృషి ఫలితంగానే సీట్లు సాధించిందని కొనియాడారు. ఈ కార్యక్రమం లో టీపీసీసీ […]

Read More

మాదిగల జనసభ పోస్టర్‌ ఆవిష్కరణ

12 శాతం రిజర్వేషన్‌ సాధనే లక్ష్యం రేపటి నుంచి జిల్లా కేంద్రాలలో సభలు హైదరాబాద్‌: నగరంలో బుధవారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు, తొలి ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అధ్యక్షతన మాదిగల జనసభ పోస్టర్లను ఆవిష్కరించారు. పిడమర్తి రవి మాట్లాడుతూ మాదిగలకు 12 శాతం రిజర్వేషన్‌ సాధనే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో జూన్‌ 7 నుంచి […]

Read More

ఇక డిసెంబరు 9న తెలంగాణ తల్లి ఉత్సవం

హైదరాబాద్‌: ఇక నుంచి ప్రతిఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి ఉత్సవం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సెక్రటేరియట్‌లో డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సోనియా గాంధీని ఆహ్వానించనున్నట్లు చెప్పారు.

Read More

దేశంలోనే అతి పిన్న వయసు ఎంపీ తెలుసా?

రాజస్థాన్‌: సంజనా జాతవ్‌ (25) దళిత వర్గానికి చెందిన మహిళ. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి 51,983 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రాం స్వరూప్‌ కోలీపై విజయం సాధించారు. 18వ లోక్‌సభకు ఎన్నికైన అతి పిన్న వయస్కులలో ఆమె ఒకరు. 2019లో మహారాజా సూరజ్మల్‌ బ్రిజ్‌ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన జాతవ్‌ ఈ ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం చేశారు.

Read More

సీఎం రేవంత్‌ను కలిసిన సీపీఐ బృందం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం సీపీఐ ప్రతినిధులు కలిశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీజేపీ చీకటి ఒప్పందం జరిగినప్పటికీ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎనిమిది స్థానాలను మిత్రపక్షాల మద్దతుతో గెలిచిన సందర్భంగా అభినందనలు తెలిపారు. కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి, సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ […]

Read More

ఇప్పటంలో వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం

తాడేపల్లి: ఇప్పటం గ్రామంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇక్కడ నాలుగు విగ్రహాలు ఉండగా రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని మాత్రమే ధ్వంసం చేసి శిలాఫలకాన్ని పగులగొట్టారు.

Read More