రాజమండ్రి: ఎంపీగా గెలుపొందిన దగ్గుబాటి పురంధేశ్వరిని బుధవారం ఆమె నివాసంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకటసుబ్బారావు, అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జ్ కర్రి చిట్టిబాబు కలిసి అభినందనలు తెలిపారు. వారితో పాటు ఈతకోట బాలస్వామి, పార్టీ అల్లవరం మండల అధ్యక్షుడు సుంకర సాయి, అమలాపురం రూరల్ ప్రధాన కార్యదర్శి డేగల వెంకటరమణ, బీజేపీ జిల్లా నాయకులు, మాజీ వైస్ ప్రెసిడెంట్ అడపా శ్రీను, తెలుగుదేశం నాయకులు ముత్యాల దుర్గారావు, అరవ చంటి, మూయిల గణపతి, ఓలేటి పరమేశ్వరరావు, మేకల ఈశ్వరరావు, మేకల చంటి, దొమ్మేటి రాధాకృష్ణ, ముత్యాల రామారావు, ఎన్.వి.రమణ, కె.సాగర్ ఉన్నారు.