నారా లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఉండవల్లిలోని నివాసంలో పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, మర్యాదపూర్వకంగా కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. భారీ మెజారిటీలతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను లోకేష్‌ అభినందించారు. తనని కలవడానికి వచ్చిన కార్యకర్తలను అప్యాయంగా పలకరించి అందరితో ఫొటోలు దిగారు.