ఏపీ ఎస్సీ, ఎస్టీ హక్కుల వేదిక అధ్యక్షుడిగా గరికిముక్కు సుబ్బయ్య

అమరావతి: ఏపీ ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడిగా గరికిముక్కు సుబ్బయ్యను నియమించినట్లు సామాజిక సమరసత వేదిక అఖిలభారత కన్వీనర్‌ శ్యాంప్రసాద్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గాల అభ్యున్న తి కోసం ఆయనను నియమిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందరికీ సమానమైన అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గొటుకుల జాషువాను నియమించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారికి వేదిక గౌరవ అధ్యక్షుడు పరుశరామ్‌(ఐఏఎస్‌), విఘ్టవు, కె.మన్మథరావు అభినందనలు తెలిపారు.