-11 ఎకరాల్లో చకచకా ఏర్పాట్లు
-లక్ష మందికి పైగా వస్తారని అంచనా
-ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల సీఎంల రాక
-భారీ భద్రతపై అధికార యంత్రాంగం ఫోకస్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సిద్ధమవుతోంది. ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. 11 ఎకరాల స్థలంలో జెట్ స్పీడ్‌తో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐదుగురు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఘనంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదిక, సీటింగ్, భద్రత, పార్కింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నారు. ప్రముఖులతో పాటుగా దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. 80 వేల మందికి సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.