జగన్‌పై తిరుగుబాటు చేసిన గిరిజనులకు ధన్యవాదాలు

12న ప్రమాణస్వీకారానికి పెద్దఎత్తున తరలిరండి
టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధారునాయక్‌

అమరావతి: రాష్ట్రంలో కూటమి గెలిచిన ఐదు గిరిజన నియోజవర్గాల్లోనే కాకుం డా మిగిలిన 159 నియోజకవర్గాలలో జగన్‌పై తిరుగుబావుటా ఎగురవేసి కూటమికి మద్దతు తెలిపిన గిరిజన ఓటర్లకు పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, అదే స్పూర్తితో ఈ నెల 12న గన్నవరంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పెద్దఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం తెలియజే యాలని టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధారునాయక్‌ గిరిజనులను ఒక ప్రకటనలో కోరారు. జగన్‌ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిన 16 గిరిజన సంక్షేమ పథకాలు పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం లో గిరిజనులకు పూర్వవైభవం రానుందని ఆశా భావం వ్యక్తం చేశారు.