పూనమ్‌కౌర్ ఆసక్తిక ట్వీట్ వైరల్
భిన్నంగా స్పందిస్తున్న వైసీపీ అభిమానులు
అమరావతి: టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పు డు సినిమాలకు దూరంగా ఉంది. అయితే సినిమాయేతర విషయాలతో ఎక్కువ గా వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను లక్ష్యం గా చేసుకుని పూనమ్ చేసే ట్వీట్లు నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆమె ‘వై నాట్ 175 అనే విషయాన్ని ఆంధ్రప్ర దేశ్ ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు’ అని ట్వీట్ చేసింది. ఆ తర్వాత అధికారంలోకి రాబోతున్న టీడీపీ, జనసేన కూటమి గురించి కూడా ట్వీట్ చేసింది. సుగాలి ప్రీతి కేసును త్వరగా పరిష్కరించాలం టూ కోరింది. తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ చేసింది. జగన్ తన ఫ్యామిలీతో కలిసిపోయి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ‘గత ఎన్నికల్లో జగన్ విజయానికి భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిలది కీలకపాత్ర. వారు తమదైన మార్గాల్లో సహనం, పట్టుదలను నేర్పారు. ఇప్పుడు వారంతా కలిసుండాలని కోరుకుంటున్నా’ అని పూనమ్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల వుతోంది. దీనిపై వైసీపీ అభిమానులు, కార్యకర్తలు భిన్న రకాలుగా స్పందిస్తు న్నారు. వైఎస్ జగన్ తన ఫ్యామిలీతో కలిసిపోయి మరింత బలంగా ప్రజల్లోకి రావాలని కోరుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.