హైదరాబాద్: దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఖాజిపల్లి చౌరస్తాలో ఓ వెల్డింగ్ షెడ్‌లో కెమికల్ ట్యాంకర్‌కు వెల్డింగ్ చేస్తుండగా ట్యాంకర్ పేలింది. దాంతో చుట్టుపక్కల ఉన్న పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. వెల్డింగ్ చేస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.