రాజకీయాలకు కేశినేని నాని బై బై

అమరావతి: విజయవాడ వైసీపీ ఎంపీగా పోటీ చేసి సోదరుడి చేతిలో పరాజ యం పాలైన కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీ యాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ ఎంపీగా కొనసాగుతూ వైసీపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. కొంచెం ఒద్దికగా ఉండి టీడీపీని అంటి పెట్టుకుని ఉండి ఉంటే అవకాశాలు దక్కేవని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రమంత్రి అవ్వాల్సిన వ్యక్తి నేడు కేవలం ఒక అనామకుడిగా మిగిలిపోయారు. రాజకీయాలలో హత్యలు ఉండవు.. ఆత్మహత్య లే ఉంటాయి అనటానికి మరో నిదర్శనమని అంటున్నారు.