10% సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని పార్లమెంటు చరిత్ర తిరగేస్తే అర్థం అవుతుంది. అయితే ఢిల్లీ అసెంబ్లీలో ఇచ్చారు అని మరో వాదన. ఆ సంగతి వదిలేస్తే అధికారంలో ఉన్నప్పుడు నలుగైదుగురిని లాగేస్తే , ప్రతిపక్షం సీటు ఉండదు అని అన్న మాయన్న.. ఇపుడు గబాల్న రూల్ బుక్ గుర్తొచ్చి అలా లేదు అని లేఖ.
అది డిమాండా? రిక్వెస్టా అర్థం కాలేదు. అలాంటి రూల్ ఉన్నట్లు ఒక కాగితం తిప్పుతున్నారు. మా అన్న జగనన్న ఇపుడు ఏదో ఒకటి చే(రా)సి అభాసుపాలు అవడం కన్నా కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తున్నాం అని మౌనంగా ఉండటం ఉత్తమం.
ఇక తల్లి కాంగ్రెస్ లో పిల్ల కాంగ్రెస్ విలీనం అని గాసిప్స్. ఒక ఫోటో కూడా వదిలారు. ఫోటో Background చూస్తే కర్ణాటక ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నట్లు ఉంది. అది ఫేక్ అని అర్థం అవుతుంది. షర్మిలను తప్పిస్తే అనే కారణం చూస్తే ఇక్కడ అధ్యక్షురాలు చెల్లి కింద పనిచేయాలి అనే ఈగో వలప వారిని తప్పించినా భవిష్యత్తులో మరొకరిని నియమిస్తారు. జాతీయ పార్టీ అంటే దీర్ఘకాలం అధ్యక్షులుగా ఒకరే ఉండటం కష్టం విలీనం తర్వాత కనీస విలువ ఉండదు. పైగా కేసులు పెట్టుకుని మోదీని ఎదిరిస్తే మరుక్షణం సిబిఐ ఈడీ యాక్టివ్ అవుతారు. విలీనం చేసి ఏం లాభం ఉంటుంది? విలువ పోగొట్టుకుని మరింత పలుచన అవడం తప్ప. విలీన వార్త సమంజసం అనిపించడం లేదు. నమ్మశక్యంగా లేదు.
ఒకవేళ నిజంగా డికేతో భేటీ అయి ఉంటే తెలంగాణ లో ఉన్న ఆస్తులు కర్ణాటక లో పవర్ ప్రాజెక్టులు ఉన్న దృష్ట్యా రేవంత్ రెడ్డి ద్వారా చర్యలు తీసుకోకుండా వెసులుబాటు కోసం అనుకోవచ్చు. భవిష్యత్తులో పొత్తు మాత్రం అవకాశం ఉండొచ్చు. సింహం సింగిల్ అంటే ఈసారి సింగిల్ డిజిట్. ఇక పేర్ని చెప్పినట్లు గతంలో సోనియాకి లొంగాడా అనే మాట చూస్తే రాష్ట్రపతి ఎన్నిక సమయంలో జైలు నుండి వచ్చి ఓటు వేసి వెళ్ళాక బెయిల్ వచ్చింది అని రూమర్ ఉంది.
కేసులు ఉన్నాయి అనే కారణం తో రాష్ట్ర ప్రయోజనాలు అనే సాకుతో మోదీతో విభేదించకుండా అడక్కుండానే బిల్లులకు మద్దతు. ఇపుడు మోదీ కూడా జగన్ ఓటమికి కృషి చేశారు కాబట్టి పక్కన ఒరిస్సా పట్నాయక్ కూడా ఇక మోదీకి రాజ్యసభ లో మద్దతు ఇచ్చేది లేదు అని తీర్మానం చేశారు.
కాబట్టి మన అన్న కూడా రేపటి స్పీకర్ ఎన్నిక మొదలుకుని భవిష్యత్ బిల్లుల్లో ఎన్డీయేకు మద్దతు ఇవ్వకపోతే జగన్ లొంగేరకం కాదు అని పేర్ని మాటను అంగీకరిద్దాం. అదే సమయంలో కాంగ్రెస్ తో సన్నిహిత సంబంధాలు కోసం మంతనాలు జరిపారు అని కూడా అంగీకరిద్దాం.
-ప్రసాద్