క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలి

-తంగిరాల సౌమ్య

నందిగామ: విద్యార్థులకు క్రమ శిక్షణతో కూడిన విద్యను అందించాలని నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య ఉపాధ్యాయులకు సూచించారు. నందిగామ రూరల్ మండలం చందాపురం ఎంపీపీఎస్‌ పాఠశాలను సౌమ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ మేరకు తరగతులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ బాగా చదవాలని సూచించారు. అన్ని తరగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాల వాతావరణం పరిశీలించారు. కొందరు ఉపాధ్యాయులకు సలహాలు సూచనలు ఇచ్చారు. విద్యార్థులకు పుస్తకాలు అందినవా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

మధ్యాహ్నం పూట విద్యార్థులకు అందిస్తున్న భోజన సదుపాయం మెనూ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలకు సంబంధించిన ఉపాద్యాయులు ఉన్నారు.