ఎమ్మెల్యే కొలికపూడిపై కేసు నమోదు 

తిరువూరు, మహానాడు :  ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై బుధవారం కేసు నమోదయింది. కంభంపాడు వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మికి చెందిన ఇంటిని ఎమ్మెల్యే కొలికపూడి, టీడీపీ నాయకులు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో వీడియోల ఆధారంగా ఇప్పటివరకు 68 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.