రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు
గుంటూరు, మహానాడు : ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువ్వుకున్నానని రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు గుంటూరుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. స్థానిక లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఆయన కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. డీజీపీ స్థాయిలో ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. చిన్నప్పటి నుంచి లక్ష్మీ నరసింహస్వామి గుడిని దర్శించుకునేవాడినన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులందరూ జవాబుదారీతనంగా ఉండేలా చూస్తామన్నారు. పోలీస్ వ్యవస్థలో కొన్ని సదుపాయాలు లేక కొన్ని విభాగాలు మూతపడ్డాయి. ఇప్పుడు వాటిని మళ్ళీ ప్రారంభించి నూతన విధానాన్ని అమలు చేస్తామన్నారు. కిందిస్థాయి పోలీసులకు ఉండే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పోలీసు ఉన్నతాధికారులు, ఆలయ ధర్మకర్తలు, పెద్దలు ఉన్నారు.