అధికారులు సమన్వయంతో పని చేయడం భేష్

త్రికోటేశ్వరుని సేవలో ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు
కోటప్పకొండగిరి ప్రదక్షిణలో పాల్గొని ప్రత్యేక పూజలు

నరసరావుపేట, మహానాడు:  త్రికోటేశ్వరుడి తొలి ఏకాదశి ఏర్పాట్లలో అధికారులు,సిబ్బంది చూపిన చొరవ అధ్వితీయమని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అభినందించారు. ఈ మేరకు తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండలో నిర్వహించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణ నిర్వహించారు.అనంతరం త్రికోటేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.

అనంతరం కొండ దిగువన ఉన్న ఆర్యవైశ్య, కమ్మ, కాపు, కుమ్మర సత్రాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు భోజన ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ… గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల విషయంలో అధికారులు చూపించిన చొరవను అభినందించారు. తక్కువ సమయం ఉన్నప్పటికీ ఏర్పాట్లు అధ్బుతంగా చేశారని అన్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నారని కొనియాడారు. ప్రత్యేకంగా పోలీసు వ్యవస్థ చూపించిన చొరవను కీర్తించారు.

కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తప్ప, ఎక్కడా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారన్నారు. ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ పోలీసులు తీసుకున్న జాగ్రత్తలతో భక్తులు సమయానికి దర్శనం చేసుకోగలిగారన్నారు. ఏకాదశి సందర్బంగా వచ్చిన భక్తులందరికీ త్రికోటేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని అభిలషించారు. నడిపించేవారు సమర్ధులైతే పని చేసేవారు కూడా సమర్ధంగా ఉంటారని నిరూపితమైందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు.