ఫేక్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి

*వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను టీడీపీకి ఆపాదించడం సిగ్గుచేటు
*రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాలవీరాంజనేయస్వామి

అమరావతి: ఫేక్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి. వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను టిడిపికి ఆపాదించడం సిగ్గుచేటు. ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించినా జగన్ మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు.సొంత బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర అంటూ టిడిపిపై తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ ది.వినుకొండలో జరిగిన హత్యకు ముఖ్యకారకుడు జగనే.

వైసీపీ హయాంలో హతుడు రషీద్ నిందితుడు జిలానీ మధ్య జరిగిన గొడవలపై నాడే చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ హత్య జరిగేదా? నాడు జగన్ చేసిన పాపానికి మూల్యం ఒక వ్యక్తి నిండు ప్రాణం. వైసీపీ హయాంలో జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. నాడు ప్రతిపక్ష నేతల్ని బయట తిరగకుండా అడ్డుకున్న పిరికిపంద జగన్.

గతంలో రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా బాధిత కుటుంబాలను ప్రతిపక్ష నేతలు పరామర్శించకుండా పోలీసులు అడ్డుపెట్టుకొని జగన్ నియంతృత్వoగా వ్యవహరించారు. కానీ నేడు టిడిపి పాలనలో జగన్ స్వేచ్ఛగా తన పర్యటనలు తాను చేసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించాలి.జగన్ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలి, లేదంటే ప్రజలే జగన్ ని శాశ్వతంగా రాజకీయాలు మానిపిస్తారు.