లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు
అమరావతి, మహానాడు: అయ్యా, మా ఇంటిని కాపాడారు… మీకు శతకోటి వందనాలయ్యా… అంటూ ఏలూరుకు చెందిన ఓ బాధితురాలు మంత్రి, యువనేత లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపింది. వివరాల్లోకి వెళితే..
తన ఇంటిని వైకాపా నేతలు కబ్జా చేశారంటూ బాధితురాలు శాంతి ఏలూరు యువగళంలో మంత్రి లోకేష్ కు సమస్య విన్నవించింది. అధికారంలోకి రాగానే ఇంటిని కబ్జా నుంచి విడిపిస్తానంటూ లోకేష్ ఆ బాధితురాలికి హామీ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. యువనేత లోకేష్ చేపట్టిన ప్రజాదర్భార్ లో జూన్ 17న ఆ బాధితురాలు కలిసింది. ఏలూరుకు చెందిన అనూషను అలా చూడగానే గుర్తుపట్టి ఇక నీ సమస్య పరిష్కారమైపోయినట్లే అంటూ ధైర్యం చెప్పి పంపించారు.
ప్రజాదర్భార్ లో నమోదైన ఫిర్యాదుపై ఎమ్మెల్యే బడేటి చంటి స్పందించి, అధికార యంత్రాంగం కదలడంతో నెలరోజుల్లోపే కబ్జాకు గురైన ఆ ఇంటిని విడిపించారు. బాధితురాలు అనూషకు ఆ ఇంటిని అప్పగించారు. దీంతో అనూష, ఆమె తల్లి శుక్రవారం ఉండవల్లి వచ్చి మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.