నీతి ఆయోగ్ నివేదికపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్
హైదరాబాద్, మహానాడు: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మోడల్ విజయం సాధించిందని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ పేదరిక నిర్మూలనలో భారతదేశంలో రెండవ స్థానంలో నిలిచిందని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన ప్రగతిని కొనియాడారు.
2020-21తో పోలిస్తే 2023-24లో 74 స్కోర్‌తో ఎస్డీజీలలో తెలంగాణ ఫ్రంట్ రన్నర్‌గా నిలిచింది. ఇది 2020-21తో పోలిస్తే ఐదు పాయింట్ల మెరుగుదలను పంచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. తెలంగాణ 91/100 స్కోర్‌తో పేదరిక నిర్మూలనలో భారతదేశంలో రెండవ స్థానంలో నిలిచింది. అనేక పరిమితులలో జాతీయ సగటును అధిగమించింది. మన రాష్ట్రం కూడా సరసమైన,స్వచ్ఛమైన శక్తిని అందించడంలో 100/100. స్వచ్ఛమైన తాగునీటిని అందించడంలో 90/100. మంచి పని,ఆర్థిక వృద్ధిలో 84/100 స్కోరు సాధించింది. జై తెలంగాణ అంటూ ఆనందాన్ని వెలిబుచ్చారు.