సంక్షేమం చూసి పార్టీలో చేరుతున్నారు

– ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్  

హైదరాబాద్, మహానాడు:  అభివృద్ధి, సంక్షేమం చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కోరుట్ల మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ మెంబర్లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరినట్లు గాంధీ భవన్ వద్ద విలేకరుల సమావేశంలో మహేష్ కుమార్ చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…  యూపీఏ హయాంలో 70 వేల కోట్లు రుణ మాఫీ మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిందన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి హయాంలో 2లక్షల రుణమాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయం. కాంగ్రెస్ నాయకత్వం మాట ఇస్తే.. తుచ  తప్పకుండా నెరవేరుస్తారు అని నిరూపించారు. 31 వేల కోట్ల రుణమాఫీ జరుగుతుంది అంటే ఆషామాషీ కాదు. గత ప్రభుత్వం ఏడున్నర లక్షల కోట్ల అప్పులు మోపి వెళ్లినా, ఆర్థిక భారమైనా రుణమాఫీ చేస్తున్నాం. చాలా మంది నాయకులు రుణమాఫీ తో మింగుడు పడక మాట్లాడుతున్నారు.

కేసీఆర్ హయాంలో అవకాశం ఉన్న ప్రతి మార్గంలో అప్పులు తెచ్చారు.  గత ప్రభుత్వాలు శాంపుల్ చూపి ఓట్లు దండుకునే రాజకీయాలు చేశారు. ప్రభుత్వం హామీలు నిలబెట్టుకుంటుంటే.. ఓర్చుకోలేక పోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ ను టీపీసీసీ అభినందిస్తుందని పేర్కొన్నారు.