– వైసీపీ నేతల ప్రచారంపై ప్రభుత్వ ఖండన
విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి, విపక్షనేత జగన్‌కు ప్రభుత్వ భద్రత తగ్గించారని, ఆయనకు సమకూర్చిన వాహనాలు కూడా పనిచేయడం లేదంటూ వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ దుష్ర్పచారమేనని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఎస్ఆర్‌సీ 2024సి నిబంధనల మేరకు మాజీ ముఖ్యమంత్రి భద్రతను Z+ శ్రేణిలో కల్పించాలని ఉన్నది. దానిని అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి, అలాగే అదనపు ఆక్టోపస్, ఎపిఎస్పి మొదలైన హంగు ఆర్భాటాల స్థానంలో.. Z+ కేటగరీకి పరిమితం చేయడమైనది.
Z+ కేటగిరీ ప్రకారం, బీఆర్ కార్‌ను అందించాలి. మాజీ ముఖ్యమంత్రికి టాటా సఫారి బీఅర్ కార్ కేటాయించారు. విజయవాడలో టాటా సఫారి బీఆర్ కార్లు లేవు కాబట్టి, విజయనగరం పూల్‌లో లభ్యమైన బీఆర్ కార్‌ను కేటాయించారు. దాని రిజిస్ట్రేషన్ నంబర్ ఎపి 39 పి 0014 మరియు 2018 మోడల్. ఇది మంచి కండీషన్లో వున్నది. అలాగే అందుబాటులో ఉన్న టాటా సఫారి బీఅర్ కార్లలో ఉత్తమమైనది.
కేటాయించిన ఆ వాహనాన్ని డ్రైవర్ రాత్రి 11:30 విజయనగరంలో స్టార్ట్ చేసి, ఉదయం 8:45 తాడేపల్లి చేరుకున్నాడు. విజయనగరం నుండి తాడేపల్లి వరకు ప్రయాణించిన ఆ కారు, డ్రైవరుకు ఎలాంటి ఇబ్బందినీ కలగజేయకుండా గమ్యస్థానం చేర్చింది, సకాలంలో. మొదట మాజీ ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది ఐఎస్‌డబల్యూ అధికారులను సంప్రదించి, టాటా సఫారి బీఆర్ కారు బదులుగా టయోటా ఫార్చునర్ బీఆర్ లేదా ప్రడో కార్ కోసం అభ్యర్థించారు. మరే ప్రత్యామ్నాయం లేనందున, మాజీ ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన నివాసం నుండి అదే టాటా సఫారి బీఆర్ కారులో ఉదయం 10:05 గంటలకి బయలుదేరారు.
ప్రయాణం మొదలెట్టిన 10 నిమిషాల వెంటనే, మాజీ ముఖ్యమంత్రి తన స్వంత టయోటా ఫార్చునర్ కారులోకి మారారు. కానీ కారు మంచి కండీషన్లోనే వున్నది, ఎలాంటి బ్రేక్ డౌన్ అవ్వలేదు. వర్షం కారణంగా, కారులో అద్దాలపై ఫాగ్ ఏర్పడటంతో, మాజీ ముఖ్యమంత్రి రూపం, కారు బయట వున్నవారికి కనిపించలేదు.
మాజీ ముఖ్యమంత్రికి ల్యాండ్ క్రూజర్ ప్రడో బీఆర్ కారు అలవాటై వుండటం వలన, ఈ కారులో ప్రయాణించడం ఆయనకు కాస్తా అసౌకర్యం అనిపించి వుండవచ్చు, ఇది కారు మార్చడానికి కారణం అయ్యింది. కారు బ్రేక్ డౌన్ అయింది అనే ఆరోపణ అబద్దం.
అదే టాటా సఫారి బీఆర్ కారు మాజీ ముఖ్యమంత్రిని అనుసరిస్తూ ప్రయాణించింది. మరోవైపు, ఏదైనా అత్యవసర పరిస్థితుల కోసం మరో టాటా సఫారి బీఆర్ కారును, తిరుపతి నుండి విజయవాడకు తెప్పిస్తున్నారు