ఎన్నాళ్లీ ఫేక్ బతుకు జగన్ రెడ్డి

హత్యకు రాజకీయ రంగు సిగ్గు చేటు
కోడికత్తి, వివేకా మర్డర్ పై చర్చకు సిద్ధమా?
– ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు

నరసరావుపేట, మహానాడు:  వ్యక్తిగత కక్షలతో జరిగిన గొడవలకు రాజకీయ రంగు పులిమి వీరంగం చేస్తున్న జగన్ రెడ్డికి ఐదేళ్ల పాలనలో జరిగిన హత్యల పై చర్చకు సిద్ధమా అని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు సవాల్ చేశారు.ఎన్నికలకు ముందు కొడికత్తి, వివేకా హత్యల గురించి నానా యాగీ చేసి, చంద్రబాబు,లోకేష్ పై నెట్టాడన్నారు. సొంత బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర అంటూ టీడీపీ పై తప్పుడు ప్రచారం చేసాడని మండిపడ్డారు.

వినుకొండలో జరిగిన హత్యను కూడా టీడీపీపై నెట్టడానికి జగన్ సిగ్గుపడాలన్నారు. వైసీపీ హయాంలో హతుడు  రషీద్, నిందితుడు జిలానీ మధ్య జరిగిన గొడవలపై నాడే చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ హత్య జరిగేది కాదన్నారు. నాడు జగన్ రౌడీలను ప్రోత్సహించి హత్యలు చేయించి ఇప్పుడు నీతులు చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి బతుకు మొత్తం అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు మాత్రమేనని అన్నారు.

2019 ఎన్నికల ముందు సానుభూతి కోసం బాబాయిని చంపి డ్రామాలాడారు, 2024 ఎన్నికల ముందు ఒక అమ్మాయి శవంతో రాజకీయం చేయబోయారు. ఇప్పుడు ఓటమిని ఓర్వలేక నిందలు,ఫేక్ ప్రచారాలకు దిగుతున్నారన్నారు. ఇలాంటి సిగ్గులేని రాజకీయాల్ని ప్రజలు సహించబోరని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఐదేళ్ల పాలనలో వందలాది మందిని వైసీపీ ముఠా హత్యలు చేస్తే ఎప్పుడూ బయటకు రాని జగన్ ఇప్పుడు శవ రాజకీయాల కోసం మాత్రమే బయటకు వచ్చారన్నారు. ఇలాంటి ఫేక్ రాజకీయం, ఫేక్ బతుకు అవసరమా జగన్ రెడ్డి అని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ ప్రశ్నించారు.