ఆర్డీఓ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

గురజాల, మహానాడు:  గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో వస్తున్న భూ సమస్యలు, రెవెన్యూ సంబంధించిన సమస్యలు గురించి వివరాలు సేకరించారు. అదేవిధంగా ఎంతమంది రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు సేకరించారు.

అనంతరం రెవిన్యూ డివిజనల్ అధికారికి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గురజాల రెవెన్యూ డివిజన్ అధికారి రమాకాంత్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలిసారిగా గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబును రెవెన్యూ డివిజన్ అధికారి రమణ కాంత్ రెడ్డి సాదరంగా కార్యాలయానికి ఆహ్వానించారు.