కుప్పం ప్రజలు లేకపోతే మేము, మా కుటుంబం లేదు

ఈ కార్యక్రమం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు
కుప్పం నియోజకవర్గం, సోమాపురంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి…

కుప్పం: ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, ఆడపడుచులు, మహిళా శక్తికి నా నమస్కారం. కుప్పం ప్రజలు, టీడీపీ కార్యకర్తలు గత 8 సార్లు చంద్రబాబును ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మీ నమ్మకంతో చంద్రబాబు 4సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఘనత కుప్పం ప్రజలకే దక్కుతుంది.కుప్పం ప్రజలు లేకపోతే మేము, మా కుటుంబం లేదు.

చంద్రబాబు గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు.చంద్రబాబు ఎప్పుడూ రాష్ట్ర ప్రజలు సుఖ,సంతోషాలతో ఉండాలని చూస్తారు.యువతను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో చంద్రబాబు ఆలోచిస్తారు. చంద్రబాబు ఎప్పుడూ కుటుంబం గురించి ఆలోచించలేదు…ప్రజల కోసమే ఆలోచిస్తారు.

హెరిటేజ్ సంస్థను మా కుటుంబం సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో చంద్రబాబు స్థాపించారు. రాజకీయాలపైనే మా కుటుంబం ఆధారపడాలని చంద్రబాబు ఏరోజూ కోరుకోరు. ప్రజాధనం దోచుకోవాలని చంద్రబాబు, మా కుటుంబం ఎప్పుడూ అనుకోదు.
నిజం గెలవాలి కార్యక్రమాన్ని నేను నిర్వహించినప్పుడు నాకు మన పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ధైర్యం, మీరు చూపించిన ప్రేమాభిమానాలను మర్చిపోలేను.నేను, లోకేష్, చంద్రబాబు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నామంటే మాపై ఎలాంటి అవినీతి మచ్చలు లేవు.ఇదే మా ధైర్యం.

చంద్రబాబుకు అవినీతి మరకలను బలవంతంగా అంటించాలని వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నించింది..కానీ వాళ్ల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కుప్పం ప్రజలకు చంద్రబాబు ప్రత్యేక మ్యానిఫెస్టోను ఇచ్చారు. దానిలోని ప్రతి అంశాన్ని చంద్రబాబు అమలు చేస్తారు.కుప్పంలో పరిశ్రమలు, విమానాశ్రయం, తదితర అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

చంద్రబాబును రాజమండ్రి జైల్లో 53రోజులు నిర్బంధించిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలతో పాటు ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చి పోరాడారు. దీనికి కారణం మహిళలపై చంద్రబాబుకు ఉన్న గౌరవం, మహిళల సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న దూరదృష్టి, చిత్తశుద్ధి.

2024 ఎన్నికల్లో మహిళలు ధైర్యంగా రోడ్లపైకి వచ్చారు, వారి కుటుంబ సభ్యులను కూడా ఎన్నికల సమయంలో వెనకుండి ప్రోత్సహించి రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించారు.వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, ఎంత బెదిరించినా, మెడమీద కత్తిపెట్టినా ప్రాణాలు ఇచ్చారే తప్ప, వెనక్కి తగ్గలేదు…పార్టీని వీడలేదు. అందుకే కార్యకర్తలంటే మా కుటుంబానికి అంత గౌరవం.

చంద్రబాబు కష్టాల్లో ఉన్న సమయంలో, ఆయన కోసం 306మంది కార్యకర్తలు ప్రాణాలు వదిలారు.వారి కుటుంబాలను నేరుగా కలవాలని, వారి కుటుంబాలను ఓదార్చాలని నిజం గెలవాలి కార్యక్రమంతో రాష్ట్రమంతా పర్యటించాను. కుప్పం నియోజకవర్గం మాకు చాలా ఇచ్చింది, మీ రుణం తీర్చుకునేందుకు నేను కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను.

కుప్పం ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు, మీకు చేతనైన సాయం చేసి మీకు అండగా నిలుస్తాను, మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాను. ఈ కార్యక్రమం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు.కుప్పం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.ధన్యవాదాలు.

కుప్పం ప్రజలు ఓ యుద్ధం చేశారు: ఎమ్మెల్సీ, కంచర్ల శ్రీకాంత్

5ఏళ్లు మనం పడిన కష్టాలు, ఇబ్బందులను దూరం చేసుకునేందుకు గత ఎన్నికల్లో కుప్పం ప్రజలు ఓ యుద్ధం చేశారు. కుప్పం ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని భువనమ్మ మన ముందుకు వచ్చారు. కుప్పం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు భువనమ్మ సంకల్పించడం చాలా సంతోషం..