లక్ష క్రియాశీలక సభ్యత్వాలే లక్ష్యం

జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు, మహానాడు :  గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు లక్షకు పైగా నమోదు కావాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనసేన జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు వెలిదండి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం జిల్లా కోర్టు ఆవరణలో సభ్యత్వ నమోదు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదుకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ సిద్దాంతాలు, పవన్ కల్యాణ్ భావజాలం, నీతీ నిజాయితీ నచ్చి న్యాయవాదులు సైతం పెద్దఎత్తున క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవటం పట్ల గాదె వెంకటేశ్వరరావు సంతోషాన్ని వెలిబుచ్చారు.

ఈ సందర్భంగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న న్యాయవాదులు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ లాంటి మహోన్నతమైన వ్యక్తితో కలిసి నడవటం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ప్రజలకు శరాఘాతంగా వైసీపీ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసిన కూటమి ప్రభుత్వానికి న్యాయవాదులందరి తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు.

కార్యక్రమంలో జనసేన నేతలు కొర్రపాటి నాగేశ్వరరావు , మాణిక్యాలరావు , ఆళ్ళ హరి , నారదాసు ప్రసాద్ , శిఖ బాలు , మధులాల్ న్యాయవాదులు సతీష్ , చెన్నారావు , సాయి చందు , సుధాకర్ , నామాల శ్రీను , శ్రీరాములు , సురేష్ , అశోక్ , ఈశ్వర్ , ప్రేమసాయి , నీలం రామ్మోహన్ , కటకంశెట్టి శ్రీను , పీ వెంకటేశ్వరరావు , బీ శ్రీను , సీ హెచ్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.