ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
గీతన్న నేతన్న వేరు కాదు
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, మహానాడు : చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించి ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో అన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని రాజకీయాలకు అతీతంగా చావడం కాదు బతకడం ముద్దు అని, పోరాడడం ముఖ్యం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…
సిరిసిల్ల చేనేత మంత్రులుగా నేను, శ్రీధర్ బాబు, విప్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వం వచ్చిన తరువాత చేనేత కార్మికుల పక్షాన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కంటిన్యూ చేయాలని అనుకున్నప్పటికీ ప్రత్యామ్నాయ పనులు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రభుత్వం వచ్చాక అంత్యోదయ కార్డులు తీయలేదు. 2014 కి ముందు సిరిసిల్లలో 12 వేల అంత్యోదయ కార్డులున్నాయి. తెలంగాణ వచ్చిన తరువాత ప్రభుత్వం మారగానే అంత్యోదయ కార్డులు ఎత్తేశారు.
మారనున్న చేనేత కార్మికుల జీవన శైలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రం వచ్చిన తరువాత, ఇప్పుడు కూడా చేనేత కార్మికులకు ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 45 వేల పవర్ లూమ్స్ ఉంటే సిరిసిల్లలోనే 35 వేల పవర్ లూమ్స్ ఉన్నాయి. మహదేవ్ పూర్ మా జిల్లాలోనే ఉంది ఓ దగ్గర ఇక్కత్ చీరలు, గద్వాల్ చీరలు, నారాయణపేటలో మరో రకమైన చీరలు తయారవుతాయి. సిద్దిపేటలో గొల్లభామ చీరలు ఇలా డిఫరెంట్ గా తయారవుతాయి. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్స్ కి సంబంధించి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్న.
సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించిన జీవన శైలిని మార్చడానికి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు విద్య వ్యవస్థ పెరగాలని కేంద్రీయ విద్యాలయాలు తెచ్చిన, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్ తెచ్చాం. సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని రాజకీయాలకు అతీతంగా చావడం కాదు బతకడం ముద్దు అని పోరాడడం ముఖ్యం అని చెప్పినం. సిరిసిల్ల చేనేత కార్మికులకు పైసలు ఇవ్వలేదని అంటున్నారు. గతంలో ఉన్న అప్పులు ప్రభుత్వాలు మారుతూ ఉంటే అప్పులు కట్టుకుంటూ పోవాల్సిందే. గత ప్రభుత్వం చేసిన బకాయిలు చెల్లించుకుంటుపోతున్నాం. చేనేత కార్మికులపై రాజకీయంగా శ్రీధర్ బాబు, నేను జిల్లా మంత్రులుగా విప్ ఆది శ్రీనివాస్ సెక్రటరీనీ కలిసి సమస్య పరిష్కారం పై చర్చించాం.
టెక్స్ టైల్ పార్క్ మేమే తెచ్చాం
ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యులు, కావూరి సాంబశివరావు మీరు టెక్స్ టైల్ మంత్రిగా తెచ్చాం. టెక్స్ టైల్ పార్క్ సిరిసిల్ల అంత పెద్దది ఉండగా వరంగల్ కి ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తలెను. కానీ సిరిసిల్ల వదిలిపెట్టి వరంగల్ కి పోయి సూరత్ లో ఉన్నవాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. నా సిరిసిల్ల జిల్లా నేతన్నలకు తీసుకోవాలి. సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ కి, సిరిసిల్ల చేనేత కార్మికుల కోసం చేనేత వర్గాలకు న్యాయం చేయండి. గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్రమంత్రి సిరిసిల్లకు టెక్స్ టైల్ పార్క్ తేవాలని విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒకటి టెక్స్ టైల్ పార్క్ ఇస్తే దానిని సిరిసిల్లకు తేవాలని సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న. సిరిసిల్ల శాసన సభ్యులతో జిల్లా నేతలకు రాజకీయాలకు సంబంధం లేదు మేమంతా వస్తాం.
గీతన్న నేతన్న వేరు కాదు
గీతన్న నేతన్న ఒకటే తాను మీద నడిచే వ్యక్తులుగా అడుగుతున్న. తప్పకుండా వాళ్ల బాధ్యత మా మీద ఉంటుంది. చేనేత కార్మికులకు జీవో నెంబర్ 1 తెచ్చి ప్రభుత్వం అవసరమైన వస్త్రం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి సూచన మేరకు సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి ఆనాటి నుండి ఉన్న సమస్యలపై చర్చ చేసి మార్గదర్శకత్వం ఇచ్చి ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. అందరూ భాగస్వామ్యం కావాలి. కేంద్రం కూడా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.