కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత 

– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ   

పెనుకొండ, మహానాడు : కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి విద్యార్థి చదువు పట్ల ఆసక్తితో పాటు లక్ష్యాన్ని ఏర్పరచుకొని, దానిని సాధించేందుకు కృషి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలను మంత్రి సవితమ్మ చేతుల మీదుగా అందజేశారు.

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి  మంత్రి సవితమ్మ మాట్లాడుతూ గతంలో  ఎన్నడూ లేని విధంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కళాశాలలు ప్రారంభం కాగానే  ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు అందిస్తున్నామన్నారు. కావున ప్రతి విద్యార్థి దశ నుంచి చదువు పట్ల ఆసక్తితో పాటు లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానిని సాధించేందుకు కృషి చేయాలన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మరిన్ని అభివృద్ధి పథకాలను అమలుచేసి కూటమి ప్రభుత్వంలో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయనున్నాన్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.