ఈ విధంగా మాట్లాడితే హైదరాబాద్ కు పెట్టుబడులు ఎలా వస్తాయి?
జాబ్ క్యాలెండర్ కాస్త జోక్ క్యాలెండర్ అయిపోయింది
గన్ పార్క్ వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ దుశ్శాసన సభగా మారింది. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలకు దక్కే గౌరవం ఇదేనా? నిన్న మహిళ ఎమ్మెల్యేలను అవమానపరిచారు. సభ నాయకుడే మా ఎమ్మెల్యేలను తిట్టేపించే ప్రయత్నం చేస్తున్నాడు.
దానం నాగేందర్ మాట్లాడే భాష… రౌడి షీటర్ మాట్లాడే భాషలా ఉన్నాయి. కన్న తల్లులను అవమానపరిచే విధంగా దానం నాగేందర్ వ్యాఖ్యలు ఉన్నాయి. మాతృత్వం విలువ తెలియని వారు మాత్రమే ఇలా మాట్లాడుతారు. దానం నాగేందర్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి. మా హయంలో మేము ఎన్నడూ చెయ్యలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో దానం నాగేందర్ ఇలానే మాట్లాడిండు.
జాబ్ క్యాలెండర్ కాస్త జోక్ క్యాలెండర్ అయిపోయింది. వృద్దులకు , మహిళలకు 2500 ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ మాట్లాడాడు. జాబ్ క్యాలెండర్ పై చర్చకు బయపడింది… చర్చ చెయ్యమంటే చెయ్యకుండా పారిపోయారు. నిరుద్యోగలను మోసం చేసినందుకు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలి.
కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీనీ వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చాడు. కాంగ్రెస్ ద్రోహాన్ని బిఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది. దానం నాగేందర్ వెంటనే క్షమాపణ చెప్పాలని అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీకీ ధన్యవాదాలు.హైదరాబాద్ ఏమైనా దానం నాగేందర్ జాగీరా? ఈ విధంగా మాట్లాడితే హైదరాబాద్ కు పెట్టుబడులు ఎలా వస్తాయి.
తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. పరిపాలన చేతకాదంటే దేశానికి ఒక దిక్సూచి చూపించాడు కేసీఆర్. జాబ్ క్యాలెండర్ కాస్తా జాబ్ లెస్ క్యాలెండర్ బోగస్ అయింది. శాసన సభ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే.